Education

Chiranjeevi: చేతికి బ్యాండేజ్ పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Published on

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భుజానికి జరిగిన చిన్న సర్జరీపై స్పందించారు. చేతికి కట్టుతో కనిపించడంతో తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ఎక్స్ వేదికగా తెరదించారు. ఇది కేవలం చిన్న కీ-హోల్ సర్జరీ మాత్రమేనని, ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నానని స్పష్టం చేశారు.

ఇటీవల అల్లు శిరీష్ వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో చిరంజీవి చేతికి ఆర్మ్ స్లింగ్ (పట్టీ) ఉండటాన్ని గమనించిన అభిమానులు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

“నా భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నాను. నా దినచర్య సజావుగా సాగుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సర్జరీ చేసిన డాక్టర్ నితిన్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆశీస్సులకు మనసు సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.

‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో ఇటీవలే విజయం సాధించిన చిరంజీవి, ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Click to comment

Popular Posts

Copyright © 2026 ProbeTimes. Developed by SSIT- 8143363500.