Education

వసీం అక్రమ్ ను హత్తుకున్న రోహిత్ శర్మ

Published on

కొలంబోలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రీమ్యాచ్ షోలో యాంకర్ సంజనా గణేశన్ సమక్షంలో జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.

టీ20 వరల్డ్ కప్ కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ కు ముందే రోహిత్ కొలంబోకు వచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రీ-మ్యాచ్ షోలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్‌ను రోహిత్ హత్తుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, క్రికెట్ మైదానంలో ఘర్షణలు ఉన్నప్పటికీ… రోహిత్-వసీమ్ ఆత్మీయంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. “క్రికెట్ స్నేహం రాజకీయాలకు అతీతం” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Click to comment

Popular Posts

Copyright © 2026 ProbeTimes. Developed by SSIT- 8143363500.