తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్, ప్రముఖ నటి త్రిషల వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి, అసత్య ప్రచారాలు చేసే వారిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూమర్స్ సృష్టిస్తున్న వారి తీరును ఆమె తప్పుబట్టారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుష్బూ… “విజయ్, త్రిష ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ముఖ్యంగా త్రిష గురించి చెప్పాలంటే, నేను చూసిన గొప్ప మహిళల్లో ఆమె ఒకరు. ఆమె చాలా మృదుస్వభావి, ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహిళపై అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా బాధాకరం” అని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకరు తుమ్మినా కూడా దాన్ని విమర్శించే దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్